calender_icon.png 9 January, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మృతి

04-07-2024 01:01:20 AM

భద్రాచలం, జూలై 3: తలలో పెన్ను గుచ్చుకుని చిన్నారి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. పట్టణంలోని సుభాష్‌నగర్ కాలనీకి చెందిన వెంకట్ మణికంట, స్వరూప దంపతుల కుమార్తె రియాన్షిక(7) యూకేజీ చదువుతన్నది. ఈ నెల 1న రియాన్షిక మంచంపై కూర్చొని రాసుకుంటూ నిద్రలోకి జారుకొని ప్రమాదవశాత్తు కిందపడడంతో పెన్ను ఆమె తలలోకి దిగింది. కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యుల సూచనతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఖమ్మంలోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసి తలలోని పెన్నును తొలగించారు. 48గంటల పాటు పరిశీలనలో ఉండాలని ఆమెను అక్కడే ఉంచి పరీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి బుధవారం తెల్లవారుజామున రియాన్షిక మృతి చెందింది.