calender_icon.png 13 March, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామివారి నిత్యాన్న ప్రసాదానికి రూ.5 లక్షల చెక్కు అందజేత

13-03-2025 12:10:02 AM

యాదాద్రి భువనగిరి, మార్చి 12 (విజయక్రాంతి) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిత్య అన్న ప్రసాదానికి హైదరాబాద్ బంజారా హిల్స్‌కు చెందిన శ్రీ కర్నాటి రమేష్ శ్రీదేవి దంపతులు ఐదు లక్షల రూపాయల చెక్కును ఆలయ కార్య నిర్వాహణాధికారి భాస్కరరావుకు బుధ వారం నాడు అందజేశారు. ఈ సందర్భం గా వారిని అర్చకులు ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.