calender_icon.png 17 January, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోర్చుగల్‌కు చెక్

07-07-2024 12:15:10 AM

యూరోకప్‌లో పోర్చుగల్ ప్రస్థానం క్వార్టర్స్‌లోనే ముగిసింది. ఫ్రాన్స్‌తో జరిగిన నాకౌట్ పోరులో పెనాల్టీ షూటౌట్‌లో ఓడిన పోర్చుగల్ ఇంటిబాట పట్టగా.. మూడోసారి యూరోకప్‌ను సొంతం చేసుకునేందుకు ఫ్రాన్స్ రెండు అడుగుల దూరంలో నిలిచింది. యూరోకప్‌లో చివరిసారి ఆడుతున్న పోర్చుగల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో బాధాతప్త హృదయంతో టోర్నీకి వీడ్కోలు పలికాడు. మరో క్వార్టర్స్‌లో జర్మనీకి స్పెయిన్ షాకిస్తూ సెమీస్‌లో అడుగుపెట్టింది.

హంబర్గ్ (జర్మనీ): ప్రతిష్ఠాత్మక యూరోకప్‌లో ఫ్రాన్స్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. భారత కాలామాన ప్రకారం శుక్రవారం అర్థరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 5 పోర్చుగల్‌పై పెనాల్టీ షూటౌట్‌లో విజయాన్ని అందుకుంది. సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్ తలపడనుంది. మ్యాచ్‌లో తొలి అర్థభాగంలో గోల్ నమోదు కాలేదు. అయితే రెండో అర్థభాగం 90వ నిమిషంలో రొనాల్డోకు గోల్ కొట్టే అవకాశం వచ్చినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 0 నిలవడంతో విజేతను తేల్చడానికి పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఫ్రాన్స్ తరఫున థియో హెర్నాండేజ్, ఓసమానే డెంబెలే, యూసఫ్ ఫొఫానా, జూల్స్ కౌండే, బ్రాడ్ లీ బార్కోలాలు బంతిని విజయవంతంగా గోల్‌పోస్టులోకి పంపించారు.

పోర్చుగల్ తరఫున క్రిస్టియానో రొనాల్డో, న్యూనో మెండెస్, బెర్నార్డో సిల్వాలు గోల్స్ కొట్టి పోర్చుగల్‌ను రేసులో ఉంచారు. అయితే సబ్‌స్టిట్యూట్ జావో ఫెలిక్స్ గోల్ కొట్టడంలో విఫలమవ్వడంతో పోర్చుగల్ ఓటమి ఖారారైంది. పోర్చుగల్ పరాజయంతో జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కన్నీటిపర్యంతమయ్యాడు. 39 ఏళ్ల రొనాల్డోకు ఇదే ఆఖరి యూరో కప్ కావడంతో టైటిల్ గెలిచి వీడ్కోలు పలకాలనుకున్న అతడికి నిరాశ తప్పలేదు. జట్టులో మరో సీనియర్ ప్లేయర్ పెపె కంటతడి పెట్టడంతో అతడిని ఓదార్చిన రొనాల్డో బాధాతప్త హృదయంతో అభిమానులకు గుడ్ బై చెబుతూ మైదానాన్ని వీడాడు. మరోవైపు స్పెయిన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 2 జర్మనీపై విజయం సాధించింది. స్పెయిన్  తరఫున డానీ ఓల్మో, మైకెల్ మెరినోలు గోల్స్ సాధించగా.. జర్మనీ తరఫున ఫ్లోరియన్ విర్ట్ గోల్ కొట్టాడు.

సెమీస్‌లో కెనడా

అటు కోపా అమెరికా కప్‌లో కెనడా సెమీస్‌లో అడుగుపెట్టింది. పెనాల్టీ షూటౌట్‌లో కెనడా 4 వెనుజులాపై విజయం సాధించింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1 సమంగా నిలిచాయి. కెనడా తరఫున జాకబ్ షఫెల్‌బర్గ్ (ఆట 13వ నిమిషంలో).. వెనుజులా తరఫున సాలోమన్ రాండన్ (ఆట 64వ నిమిషంలో) గోల్స్ సాధించారు. బుధవారం జరగనున్న సెమీఫైనల్లో అర్జెంటీనాతో కెనడా అమీతుమీకి సిద్ధమైంది.