calender_icon.png 17 November, 2024 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనాకు చెక్

17-11-2024 12:00:00 AM

  1. చిత్తుగా ఓడిన చైనీయులు
  2. కనీస పోటీ ఇవ్వని వైనం

- మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ మ్యాచ్ పాయింట్ల పట్టికలో భారత స్థానం

రాజ్‌గిర్: పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకంతో సత్తా చాటి.. తమను ఓడించడం అసాధ్యం అంటూ విర్రవీగిన చైనా హాకీ జట్టుకు సలీమా నేతృత్వంలోని భారత మహిళల జట్టు బిగ్ షాక్ ఇచ్చింది. రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో 3-0 తేడాతో చిత్తు చేసి చుక్కలు చూపించింది.

మాకు ఎదురుందా అంటూ విర్రవీగుతూ రెచ్చిపోయిన డ్రాగన్ జట్టు కు ఈ ఓటమి ఊహించని షాకే అని చెప్పా లి. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు ఫీల్డ్ గోల్స్‌తో పాటు ఓ పెనాల్టీ కార్నర్‌ను కూడా సంధించి.. చైనాకు అందనంత ఎత్తులో నిలిచింది. ఈ టోర్నీలో గోల్స్‌తో రెచ్చిపోతున్న దీపిక ఈ మ్యాచ్‌లో కూడా గోల్ సాధించింది.  సంగీత కుమారి (32వ నిమిషం), సలీమా (37వ నిమిషం), దీపిక (60వ నిమిషం) గోల్స్ చేశారు.

చైనా ప్లేయర్లు గోల్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా కానీ వారికి ఫలితం దక్కలేదు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ లీగ్ స్టేజ్‌లో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. గ్రూప్ స్టేజ్ ముగిసే సరికి మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్‌కు అర్హత సాధించనున్నాయి.