ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులతో డిప్యూటి కమిషనర్ పి.దశరధ్ సమీక్ష సమావేశం
రంగారెడ్డి, జనవరి 16 (విజయ క్రాంతి ): రంగారెడ్డి డివిజన్ పరిధిలోని వివిధ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో పలు కేసుల్లో పట్టుబ డిన గంజాయి, డ్రగ్స్ డిస్పోజల్ చేయాలని, ఆయా కేసు లో పట్టుబడిన వాహనాల వేలాన్ని వెంటనే పూర్తి చేయా లని రంగారెడ్డి ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్ పి.దశరథ్ అధికారులను ఆదేశించారు. గురువారం తెలంగాణ ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమా వేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 2700 కేజీల గంజాయితోపాటు డ్రగ్స్ను వెంటనే డిస్పోజల్ చేయాలని, 650 వాహనాలను వెంటనే వేలం వేయాలని సూచించారు. ఎక్సైజ్ సిబ్బంది ఎంత ప్రభుత్వ నియమ నిబంధనలతో పనిచేయాలని, శాఖకు చెడ్డ పేరు తెచ్చే విధంగా సిబ్బంది వ్యవహరించవద్దని ఆయన సూచించారు. కేసులకు సంబంధించి చార్జీషీట్లను పకడిబందిగా రూపొందిస్తే నేరాలకు పాల్పడే శిక్షలు పడే అవకాశం ఉందన్నారు.
ఆయా ఎక్సైజ్ పరిధిలో నిర్థారించిన టార్గెట్స్ను పూర్తి చేయాలని, టార్గెట్స్ రావాలంటే నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ను అరికట్టాలని, డ్రగ్స్ వినియోగంపై గట్టి నిఘా పెట్టి... వాటిని సరఫరా చేసే వారిని పట్టుకోవాలన్నారు. క్రైమ్ కంట్రోల్కు ఎన్ ఫోర్స్మెంట్ టీమ్లు చురుకుగా వివరించాలన్నారు.
స్టేషన్ల వారిగా క్రైమ్, డిస్పోజల్ సామాగ్రిపై ఆయన సమీక్షించారు. అసిస్టేంట్ కమిషనర్ ఆర్.కిషన్, శంషాబాద్, మేడ్చల్, మాల్కాజ్గిరి, సరూర్నగర్, వికారాబాద్ ఎక్సైజ్ సూపరిండెంట్లు కృష్ణప్రియ, ఫయాజోద్దీన్, కె.నవీన్కుమార్, ఉజ్వల రెడ్డి విజయభాస్కర్తోపాటు అన్ని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సీఐలు హాజరయ్యారు.