వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రచనాదర్శకత్వం వహిస్తున్నారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీగణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుందీ సినిమా. ఈ సందర్భంగా హీరోయిన్ అనన్య నాగళ్ల మీడియాతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. “డైరెక్టర్ మోహన్ గారు ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది. -ఇప్పటివరకూ ఇలాం టి కథ నేను వినలేదు. అందుకే ఓకే చెప్పాను.
సినిమాలో డిటెక్టివ్ అమ్మ పేరు షర్మిలమ్మ, నాన్న పేరు లోకనాథ్, డిటెక్టివ్ పేరు ఓం ప్రకాశ్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్‌తో కలిపి సినిమాకు ‘షెర్లాక్ హోమ్స్’ అని పేరు పెట్టారు. తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి ‘చంటబ్బాయ్’ గుర్తుకు వస్తుంది. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆ సినిమా పేరును మా సినిమాకు ట్యాగ్‌లైన్‌గా పెట్టారు. ఈ చిత్రంలో నా పాత్ర పేరు భ్రమరాంబ. కథలో నా రోల్ చాలా బావుంటుంది. ఇప్పటివరకూ చేయని రోల్. ఇది ఎక్స్‌ట్రార్డినరీ స్టొరీ. -ఇందులో రవితేజతో నటించడం మంచి ఎక్స్‌పీరియన్స్, కొత్త వారిలో ఒక జీల్ ఉంటుంది. తను ఉన్న సీన్ బెటర్ చేయడానికి చాలా ప్రయత్నించారు.
అది నాకు చాలా నచ్చింది. ఇందులో ఒక క్యూట్ లవ్‌స్టొరీ ఉంటుంది. -వంశీ నందిపాటి గారు సినిమాకు కావాల్సిన చాలా ముఖ్యమైన సూచనలిచ్చారు. ప్రస్తుతం నా జర్నీ పట్ల -చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు కంటిన్యూగా వర్క్ వస్తోంది. రీసెంట్‌గా ‘పోట్టేల్’తో మంచి ప్రశంసలు వచ్చింది. ఆ సినిమా తర్వాత నా దగ్గరకు మంచి కథలొచ్చాయి. రెండు సినిమాలు సైన్ చేశాను. -తెలుగుతోపాటు హిందీలో ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తున్నా. నేను నటించిన ‘-కథాకళి’, ‘లేచింది మహిళా లోకం’ సినిమాలు త్వరలో రాబోతున్నాయి” అని తెలిపింది అనన్య.