29-03-2025 02:07:43 AM
విస్తృత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ నాయకత్వం అస్పష్టమైన హామీలను వదిలి డీలిమిటేషన్‌పై ఒక పారదర్శకమైన రోడ్ మ్యాప్‌ను అందించాలి. 2026 జనగణన తర్వాత ప్రారంభం కావచ్చని భావిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ కూడా అస్పష్టతగా ఉన్న పక్షంలో తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు.
బీజేపీ సందేశాలు దక్షిణాది రాష్ట్రాల భయాలను పోగొట్టడంలో ఏమాత్రం పని చేయలేదు. దక్షిణాది రాష్ట్రాల సీట్ల నిష్పత్తిని ఏమాత్రం తగ్గించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి నేతలు ఇచ్చిన హామీల్లో స్పష్టత కరువవడం, దీనికి తోడు శాసనపరమైన చట్టం కూడా లేకపోవడంతో ఈ అను మానాలకు మరింత ఆజ్యం పోశాయి. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా దేశంలో భారతీయ జనతా పార్టీ తెరపైకి తెచ్చిన డీలిమిటేషన్ చర్చ దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంది.
ఈ వివాదాస్పద అంశం జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చుట్టూ తిరుగుతోంది. సరైన ప్రాతి నిధ్యం ఉండేలా చూడడం కోసం రాజ్యాంగంలోనే ఈ ప్రక్రియ పొందుపరచబడింది. అయితే చివరిసారిగా 1973లో ప్రధాన నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పటినుంచి దేశ భౌగోళిక, ఆర్థిక స్వరూపాలు గణనీయంగా మార్పు చెందడంతో వాటాలపై హక్కుల డిమాండ్లు కానీ, అలాగే విభేదాలు సైతం గతంలో ఇంత ఎక్కువగా ఎప్పుడూ లేవు.
34 కోట్ల నుంచి 140 కోట్లకు
దేశంలో పార్లమెంటు స్థానాల సంఖ్య 574గా నిర్ణయించినప్పుడు దేశ జనాభా కేవలం 34 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 140 కోట్లు దాటిపోవడంతో పాటుగా గణనీయమైన అంతర్గత వలసలు ముఖ్యంగా రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాలు పెరిగిపోయాయి. ఈ మార్పు ప్రస్తుత జనాభాను ప్రతిబింబించే విధంగా పార్లమెంటు స్థానాల సంఖ్యను పెంచాలనే చర్చకు ఆజ్యం పోసింది. అయితే ఈ చర్చ కేవలం అంకెలకు సంబంధించినది మాత్రమే కాదు. ఇది న్యాయానికి, ఫెడరల్ సమతుల్యతకు సంబంధించినదే కాక ప్రాంతీయ విభేదాలు పెరిగే ప్రమాదానికి సంబంధించినది.
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న స్థానాల్లో ఒక్కటి కూడా తగ్గదని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. అయితే ఈ రాష్ట్రాల భయాలను పోగొట్టడానికి ఉద్దేశించిన వాదన మాత్రమే ఇది. అయితే ఈ హామీ వెనుక కీలకమైన ముసుగు ఒకటి ఉంది. ఒకవేళ ఉత్తరాది రాష్ట్రాలు జనాభా పెరుగుదల కారణంగా ఎక్కువ స్థానాలను పొందగలిగి, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం యథాతథంగా ఉన్నట్లయితే పార్లమెంటులో ఆ రాష్ట్రాల పలుకు బడి తగ్గిపోతుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల సీట్ల సంఖ్య పెరిగితే.. తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఆర్థిక సమర్థత, జనాభా పెరుగుదలను విజయవంతంగా కంట్రోల్ చేసినప్ప టికీ జాతీయస్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో వాటి పలుకుబడి తగ్గిపోతుంది.
ఈ తగ్గుదల కేవలం గణాంకాలకు సంబంధించిన పరిణామం మాత్రమే కాదు. ఇది ఉత్తరాది, దక్షి ణాది మధ్య విభేదాలను మరింతగా పెంచుతుంది కూడా. ఫలితంగా ముఖ్యంగా దక్షిణా దిలో తన ఉనికిని విస్తరించుకోవాలని బీజేపీ అనుకొంటున్న తరుణంలో ఉత్తరాది, దక్షిణాది మధ్య విభేదాలను మరింతగా పెంచ డంతో పాటు దేశ సమైక్యతకు ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉంది.
దక్షిణాది రాష్ట్రాల భయాలను వాస్తవాలు సైతం నొక్కి చెప్తున్నాయి. 1970 దశకంలో దేశం కుటుంబ నియంత్రణను పాటించడం మొదలుపెట్టినప్పటినుంచీ దక్షిణాది రాష్ట్రాలు తమ జనాభాను నిలకడగా ఉంచడంలో రాణించడంతో పాటుగా అక్షరాస్యత, వైద్యసేవలు, ఆర్ధిక ఉత్పత్తిని గణనీయంగా పెంచుకున్నాయి. ఉదాహరణకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కేంద్రం వనరుల్లో చిన్నపాటి వాటాను అందుకొంటున్నప్పటికీ దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)కి గణనీయంగా తోడ్పడ్డాయి.
దీనికి భిన్నంగా చాలా ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో వెనుకబడడంతో వాటి జనాభా శరవేగంగా పెరిగింది. పూర్తిగా జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈ అసమానతకు మరింత ప్రోత్సాహం అందించినట్లు కావడంతో పాటుగా అభివృద్ధి పరం గా విజయాలు సాధించినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలను శిక్షించినట్లవుతుంది. ఇలాంటి ఫలితం ఫెడరల్ సమానత్వాన్ని దెబ్బతీయడమే కాకుండా సమతుల్య అభివృద్ధి అనే జాతీయ లక్ష్యానికి భిన్నమైనది అవుతుంది.
మోసపూరిత హామీ!
బీజేపీ సందేశాలు ఈ భయాలను పోగొట్టడంలో ఏమాత్రం పని చేయలేదు. దక్షి ణాది రాష్ట్రాల సీట్ల నిష్పత్తిని ఏమాత్రం తగ్గించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి నేతలు ఇచ్చిన హామీల్లో స్పష్టత కరువవడం, దీనికి తోడు శాసనపరమైన చట్టం కూడా లేకపోవడంతో ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోశాయి.
ఉత్తరాదిన మొ త్తం పార్లమెంటు స్థానాల సంఖ్య గణనీయం గా పెరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడున్న స్థానాలను కొనసాగించడం అంటే మోసపూరితమే అవుతుందని దక్షిణాది నేతలు వాదిస్తున్నారు. ఇది బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలకు అనుకూలంగా మారడం, పార్టీ ఎన్నికల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలు బలహీనపడడంతో అధికార త్రాసు అటువైపు మొగ్గేలా చేస్తుంది.
ఈ సమస్య పూర్తిస్థాయి సంక్షోభంగా మారడానికి ముందే విస్తృత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ నాయకత్వం అస్పష్టమైన హామీలనుంచి ముందుకు సాగి ఒక పారదర్శకమైన రోడ్ మ్యాప్‌ను అందించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. 2026 జనగణన తర్వాత ప్రారంభం కావచ్చని భావిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ కూ డా అస్పష్టతగా ఉన్న పక్షంలో తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు. అందుకే ఇప్పుడే స్పష్టత ఉన్న పక్షంలో తర్వాత ఎదురయ్యే విభజనను అడ్డుకొంటుంది.
ఆచరణాత్మక పరిష్కారం
అందువల్ల దీనికి పరిష్కారం ఏమిటి? సుపరిపాలన, ఆర్ధిక పనితీరులో రాణించిన రాష్ట్రాలు నష్టపోకుండా జనాభాను ఇతర కొలమానాలతో బ్యాలెన్స్ చేస్తూ ఒక న్యాయమైన వైఖరి తప్పనిసరి. ఒక ఆచరణాత్మక ప్రతిపాదన ఏమిటంటే రాష్ట్రాలవారీగా ఇప్పుడున్న పార్లమెంటు బలం 574 సీట్లను బేస్‌లైన్‌గా కొనసాగించడం.
అ తర్వాత జనా భా పెరుగుదలను, ఇతర అంశాలకు స్థానం కల్పించడానికి అదనంగా మరో 180 స్థానాలను చేర్చడం. ఈ స్థానాల్లో 90 సీట్లను జీడీపీకి తోడ్పాటునందించిన రాష్ట్రాలకు, మిగతా 90 స్థానాలను జనాభా పెరుగుదలను ప్రతిబింబించే రాష్ట్రాలకు కేటాయిం చాలి. ఈ ద్వంద్వ కొలమానాల ఫార్ములా అనేక లక్ష్యాలను సాధిస్తుంది.
ఇది ఎక్కువ ప్రాధాన్యత అవసరాన్ని తీర్చడంతో పాటు గా అభివృద్ధి విజయాలను గుర్తించడం, ఏ ఒక్క ప్రాంతం పార్లమెంటులో ఆధిక్యత ప్రదర్శించకుండా నిరోధించడం చేస్తుంది. ఇలాం టి ఫార్ములా ఉత్తరాది, దక్షిణాది మధ్య విభజనను మరింత పెరగనీయకండా వాటి మధ్య అంతరాలను తగ్గిస్తుంది. దేశ ఆర్థిక ఉత్పత్తికి గణనీయమైన తోడ్పాటునందించినందుకు తమ తోడ్పాటుకు తగిన ప్రాధా న్యత లభిస్తుంది.
అదే సమయంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉత్తరాది రాష్ట్రాలకు తగు ప్రాతి నిధ్యం లభిస్తుంది. కీలకమైన విషయం ఏమిటంటే ఈ వైఖరికి ఫలి తంలో అన్ని రాష్ట్రాలకు తగినంత ప్రాతిని ధ్యం ఉండేలా చూసే ఏకాభిప్రాయం అవస రం. అంతేకాకుండా భవిష్యత్తులో జరగబో యే డీలిమిటేషన్ ప్రక్రియలకు ఇది మార్గదర్శకంగా నిలవడమే కాకుండా దేశ ప్రజస్వా మిక వ్యవస్థను మరితం బలోపేతం చేస్తుంది.
సమయం మించపోతోంది!
డీలిమిటేషన్ ప్రక్రియ సాంకేతిక ప్రక్రియకు మించినది. ఇది దేశ ఫెడరల్ స్ఫూర్తికి ఒక పరీక్ష. జనాభా కేంద్రంగా జరిగే డీలిమిటేషన్ ప్రక్రియ దేశ పురోభివృద్ధికి అత్యంత కీలకమైన ఒక ప్రాంతాన్ని దూరం చేసే ప్రమాదం ఉందనే వాస్తవాన్ని బీజేపీ నేతలు గుర్తించక తప్పదు.
సమతుల్యమైన పరిష్కారాన్ని ఎంచుకోవడం ద్వారా ఆ పార్టీ విభజ నకన్నా ఐక్యతకు తాము కట్టుబడి ఉన్నామ నే విషయాన్ని చాటి చెప్పగలుగుతుంది. అ యితే సమయం మించిపోతోంది. ఈ చర్చ పరిస్థితి చేయిదాటి పోయేలా మారకముందే ఇప్పుడే స్పష్టత ఇవ్వాల్సిన సమయం ఇది.
ఒక ఆచరణాత్మక ప్రతిపాదన ఏమిటంటే రాష్ట్రాలవారీగా ఇప్పుడున్న పార్లమెంటు బలం 574 సీట్లను బేస్‌లైన్‌గా కొనసాగించడం. అ తర్వాత జనా భా పెరుగుదలను, ఇతర అంశాలకు స్థానం కల్పించడానికి అదనంగా మరో 180 స్థానాలను చేర్చడం.
ఈ స్థానాల్లో 90 సీట్లను జీడీపీకి తోడ్పాటునందించిన రాష్ట్రాలకు, మిగతా 90 స్థానాలను జనాభా పెరుగుదలను ప్రతిబింబించే రాష్ట్రాలకు కేటాయించాలి. ఈ ద్వంద్వ కొలమానాల ఫార్ములా అనేక లక్ష్యాలను సాధిస్తుంది. ఇది ఎక్కువ ప్రాధాన్యత అవసరాన్ని తీర్చడంతో పాటు గా అభివృద్ధి విజయాలను గుర్తించడం, ఏ ఒక్క ప్రాంతం పార్లమెంటులో ఆధిక్యత ప్రదర్శించకుండా నిరోధించడం చేస్తుంది. ఇలాం టి ఫార్ములా ఉత్తరాది, దక్షిణాది మధ్య విభజనను మరింత పెరగనీయకండా వాటి మధ్య అంతరాలను తగ్గిస్తుంది.
ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల సీట్ల సంఖ్య పెరిగితే.. తమిళనాడు, కేరళ, కర్ణాటక లాంటి రాష్ట్రాలు ఆర్థిక సమర్థత, జనాభా పెరుగుదలను విజయవంతంగా కంట్రోల్ చేసినప్పటికీ జాతీయస్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో వాటి పలుకుబడి తగ్గిపోతుంది. ఈ తగ్గుదల కేవలం గణాంకాలకు సంబంధించిన పరిణామం మాత్రమే కాదు. ఇది ఉత్తరాది, దక్షిణాది మధ్య విభేదాలను మరింతగా పెంచుతుంది కూడా.