20-04-2025 10:27:07 PM
24 గంటల్లో ఛేదించిన పోలీసులు...
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): తెల్లవారు జామున ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో మంగళసూత్రాన్ని, మరోక ఇంట్లో ఓ మొబైల్ ఫోన్ న్ని గుర్తుతెలియని వ్యక్తి అపహరించిన సంఘటన ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ తెలిసిన వివరాల ప్రకారం... పట్టణంలోని హనుమాన్ నగర్ ఏరియాకి చెందిన బుర్ర రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి తన ఇంటి కిటికీ పక్కన పెట్టిన మొబైల్ ఫోన్ ని కొట్టేసిన ఓ దొంగ ఆ ఇంటి ముందు ఉండే మరోక ఇంట్లో ఇరుముల్ల శరణ్య అనే మహిళ ఇంట్లో నిద్రిస్తుండగా బయటనుండి ఇంటికి గడియ పెట్టి కిటికీ నుండి ఆమె మెడలోని మూడు తులాల మంగళసూత్రాన్ని లాక్కుని అక్కడి నుండి బైక్ మీద పారిపోయాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు గోదావరిఖని కాకతీయ కాలనీకి చెందిన గుంజ ఇమాన్యుల్ గా గుర్తించారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద నిందితుడిని గుర్తించి అతడి వద్ద నుండి మూడు తులాల బంగారు పుస్తెలతాడు, మొబైల్ ఫోన్, బైక్ ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు జల్సాలకు అలవాటు పడి దొంగతనలకు పాల్పడే వాడని పేర్కొన్నారు. 24 గంటలు దాటకు ముందే దొంగతననికి ఛేదించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి,పట్టణ ఎస్సై రాజశేఖర్, కాశిపేట ఎస్సై ప్రవీణ్, సిబ్బంది జంగు, వెంకటేశ్, రాకేష్, మహేష్, శ్రీనివాస్, సతీష్ లు ఉన్నారు.