calender_icon.png 7 January, 2025 | 12:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబరాన్నంటిన సిపిఐ శ్రేణుల సంబురాలు

05-01-2025 07:39:05 PM

కార్పొరేషన్ ఏర్పాటుపై వెల్లువెత్తిన ఆనందం

కార్పొరేషన్ కల సాకారం చేసుకున్న నేత 'కూనంనేని'

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం, పాల్వంచ జంట పట్టణాలు, సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామాలను కలుపుతూ రాష్ట్ర ప్రభుతం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఏజెన్సీ ప్రాంతాలకు జిల్లా కేంద్రంగా ఉన్న కొత్తగూడెం కార్పొరేషనుగా మార్పు చెందుతుండటంతో నగరాలకు ధీటుగా అన్నిరంగాల్లో అభివృద్ధి చెంది అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఏర్పడనున్నాయి. కార్పొరేషన్ ఏర్పాటుపై పట్టుబట్టి సాధించిన కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావుకు అన్ని వర్గాల ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేషన్ ప్రకటన వెలువడటంతో సిపిఐ ఆధ్వర్యంలో ఆదివారం సంబరాలు జరిపారు.

బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు, స్వీట్లు పంచి సంబరాలు జరిపారు. ఈ సందర్బంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటు ఎమ్మెల్యే కూనంనేని కల అని, కార్పొరేషన్ ఏర్పాటుపై ద్రుష్టి సారించిన కూనంనేని ఏడాది కాలంగా ప్రభుత్వ పెద్దలతో జరిపిన చర్చలు, సంప్రధింపులు ఫలితాన్నిచ్చాయని అన్నారు. కార్పొరేషన్ ఏర్పాటై వల్ల జంటపట్టణాలు, సుజాతనగర్ మైదాన ప్రాంత గ్రామాలతోపాటు పరిసర పాఠాలు సమగ్రంగా అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, కందుల భాస్కర్, ఎస్ కె ఫహీమ్, మాచర్ల శ్రీనివాస్, పొలమూరి శ్రీను, దుర్గ, ధర్మరాజు, సత్యనారాయణాచారి, రామమూర్తి, యాకుబ్, బండి రమేష్, ఖయూమ్, లక్ష్మి, అజయ్, యాండ్ర మహేష్ తదితరులు పాల్గొన్నారు.