calender_icon.png 2 February, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిన కేంద్రం...

01-02-2025 10:57:53 PM

కేంద్ర బడ్జెట్ లో మైనారిటీలకు మొండి చేయి..

మైనారిటీ జిల్లా అధ్యక్షులు యండీ యాకూబ్ పాషా..

పాల్వంచ (విజయక్రాంతి): కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మైనారిటీల పట్ల సవతి తల్లి ప్రేమను ప్రదర్శించారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం  అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా శనివారం ఒక ప్రకటనలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నేటి వరకు ప్రవేశపెట్టిన బడ్జెట్లలో మైనారిటీల సంక్షేమానికి ఏనాడు కూడా ప్రాధాన్యత కల్పించలేదని అన్నారు. గత ఏడాది బడ్జెట్ లో మైనారిటీ లకు రూ. 3183.24 కోట్లు కేటాయించగా ఈ యేడాది రూ. 3350 కోట్లను మాత్రమే కేటాయించారని, గత యేడాదితో పోలిస్తే రూ. 167కోట్లు మాత్రమే పెంచారని అన్నారు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం పేద మైనారిటీలకు అందిస్తున్న ఉపకార వేతనాలను కూడా పూర్తిగా రద్దు చేసిందని, గణాంకాలలో మాత్రం మైనారిటీ ఉపకార వేతనాలకు నిధులు కేటాయిస్తున్నట్టు చూపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమానికి ఒక్క పథకం కూడా అమలు జరగట్లేదని మైనారిటీలను విద్యా పరంగా, ఆర్ధిక పరంగా అణగాద్రొక్కాలనే ఆలోచనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు.