17-03-2025 12:00:00 AM
భద్రాచలం మార్చి 16 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్య కళ్యాణ సేవకు భక్తుల స్పందన భారీగా పెరిగింది. ప్రతిరోజూ ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించబడుతోంది. ఈ పవిత్ర కార్యంలో పాల్గొని భక్తులు తమ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారు.శనివారం, ఆదివారం, పండుగ రోజులలో ఈ సేవకు భక్తుల సంఖ్య మరింత పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి భక్తి పరవశమవుతున్నారు. అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనాలకు ప్రత్యేక క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో శుచిత, భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి ఏర్పాట్లు పూర్తిచేశారు. భద్రాచలం దేవస్థానం ప్రతినిధులు మాట్లాడుతూ, “శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామాన్నారు