calender_icon.png 6 February, 2025 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి ఆర్టీసీ డిపోకు కాసుల పంట

06-02-2025 12:00:00 AM

సమస్యలు కూడా బోలెడే నీటి సమస్య, మరుగుదొడ్ల సమస్యతో సతమతమవుతున్న ప్రయాణికులు

కామారెడ్డి, ఫిబ్రవరి ౫, (విజయక్రాంతి): కామారెడ్డి ఆర్టీసీ డిపోకు కాసుల వర్షం కురుస్తున్న కనీస మౌలిక వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. అనుభవజ్ఞులైన డ్రైవర్ల నైపు ణ్యంతో కూడిన మెకానికులు సిబ్బం ది సహకారంతో కామారెడ్డి డిపో 7 కోట్ల 22 లక్షల ఆదాయంతో తో కళకళలాడుతుంది.

ఆర్టీసీ సమస్తకు ఆదాయాన్ని సమకూర్చేం దుకు శక్తి వంచన లేకుండా డ్రైవర్ కండక్టర్లు మెకానిక్ సిబ్బంది ఆర్టీసీ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. కామారెడ్డి ఆర్టీసీ బస్టాండుకు నిత్యం కామారెడ్డి ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ సిరిసిల్ల నిజా మాబాద్ బోధన్ బైంసా ముంబై నిర్మల్ కరీంనగర్ వరంగల్ సిద్దిపేట రామయం పేట మెదక్ హైదరాబాద్ సికింద్రాబాద్ డిపోలకు చెందిన బస్సులు వస్తు పోతుం టాయి.

ప్రయాణికులు వేలాదిమంది ప్రయాణం కామారెడ్డి బస్టాండ్ నుండి చేస్తున్నారు. ప్రతిరోజు కామారెడ్డి బస్టాండ్ కు ఎన్ని కోట్ల ఆదాయం ప్రయాణికులు డిపో పరిధిలో 122 బస్సులు నిత్యం ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయని వీటిలో 77 ప్రభుత్వం ఆధీనంలో ఉండగా 45 బస్సులు ప్రైవేట్ వారు వారికి నిర్దేశించిన రూట్లలో బస్సులు తిప్పుతున్నారని ఆమె తెలిపారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో వారికి కేటాయించిన సమయంలో బస్సులను తిప్పడం జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల మహిళలు ప్రయాణం ఎక్కువ చేస్తున్నారని ప్రతిరోజు 27 లక్షల వరకు ఆదాయం వస్తుంది.  గతంలో 68 శాతం ఉన్న యాక్యుపెన్సి రేటు ప్రస్తుతం 94% పెరగడం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చింది.

సమస్యలు బోలెడు

ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు. ప్రయాణికులకు తాగునీరు మరుగుదొడ్ల సౌకర్యం లేక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రైవేట్ దుకాణాల్లో ఎక్కువ డబ్బులు పెట్టి వాటర్ బాటిల్లు ప్రయాణికులు కొనుగోలు చేస్తున్నారు.

డిపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ మరుగుదొడ్ల నిర్వాహకులు 10 రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రయాణికులను నిలువు దోపిడికి గురి చేస్తున్నారు.

నీటి సమస్యతో పాటు ప్లాట్ఫామ్ సమస్య కూడా ఉంది. బస్టాండ్ అవర నా లో గుంతల మయం తో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండుకు ఆదాయం పెరిగిన ప్రయాణికుల సమస్యలను అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని ప్ర యానికులు ఆరోపిస్తున్నారు.

త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం

కామారెడ్డి ఆర్టీసీ డిపో నిత్యం 27 లక్షల ఆదాయం వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పించడంతో పాటు పల్లె వెలుగు బస్సులను గ్రామీణ ప్రాంతాలకు సకాలంలో చేర్చడం వల్ల అదిక ఆదాయం వస్తుందని తెలిపారు. త్వరలోనే నీటి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

ప్రయాణికులకు మరుగుదొడ్ల సమస్య లేకుండా కృషి చేస్తామన్నారు . ఆర్టీసీ బస్టాండ్ లో సీసీ రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులకు ఎస్టిమేట్ చేసి పంపించడం జరిగిందన్నారు. 

నీటి  సమస్య లేకుండా పరిష్కరిస్తామన్నారు. జరుగుతుందన్నారు.  ప్రయాణికుల సమాచార నిమిత్తం కామారెడ్డి బస్టాండ్ లో ఫోన్ అందుబాటులో ఉందని ఫోన్ నెంబర్ 08468 220 281 కు ఫోన్ చేసి బస్సుల వేళలు తెలుసుకోవచ్చని చెప్పారు.

 ఇందిరా డిపో మేనేజర్ కామారెడ్డి