21-04-2025 12:48:27 AM
కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలకు మండిపాటు
ఎమ్మెల్యే దిగజారుడుతనానికి నిదర్శనం
మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నాయకులు
మెదక్, ఏప్రిల్ 20(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత, మా జీ సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మెదక్ ఎమ్మె ల్యే మైనంపల్లి రోహిత్రావుపై కేసు నమోదు చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్, ఎమ్మెల్సి శేరి సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం బీఅర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే ప్రవర్తన ఉండాలీ కాని దిగజర్చే విధంగా ఉండొద్దన్నారు.
14 సంవత్సరాల పోరాటం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై పోలీ సులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసే విధంగా కుట్రపూరితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రామయంపేటలో బీఅర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేస్తే ఇది మా పరిధిలోకి రాదంటూ ఆ ఫిర్యాదును రిజెక్ట్ చేయడం జరిగిందన్నారు.
అలాంటప్పుడు బీఅర్‌ఎస్ పార్టీ కార్యకర్త రవీందర్ రెడ్డిని పోలీసు స్టేషన్ తీసుకువచ్చి కొట్టి అతని ఫోన్ సీజ్ చేశారని, ఇదెక్కడి న్యాయం అన్నారు. పోలీసు చర్యల ద్వారా బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను భయపడితే ఉపేక్షించేది లేదన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. ఈ సమావేశంలో జడ్పీ మాజీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు కిష్టయ్య, గౌస్, ప్రభు రెడ్డి,మాజీ సర్పంచ్లు లింగం. మేకల సాయిలు. యామ్ రెడ్డి. మైపాల్ రెడ్డి. మోహన్ నాయ క్. ఎలక్షన్ రెడ్డి. గంజి ప్రభాకర్ తదితరులుపాల్గొన్నారు.