calender_icon.png 31 January, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంపై కేసు పెట్టాలి..

29-01-2025 01:50:48 AM

* బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

* నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడి

హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల ఒక పన్ను కట్టే పౌరుడిగా రాష్ట్ర ఖజానాకు పన్నులు కడుతున్న తనకు, తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టం జరిగిందని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా తాను నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

దానికి సంబంధించి మొత్తం రీసెర్చి చేసి ఆ సమాచారాన్ని ఫిర్యాదులో పొందుపరిచినట్టు చెప్పారు. మంగళవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.

రాష్ట్రంలో ఒక గొప్ప ఇండస్ట్రీ పెట్టడం కోసం, వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా, కోట్లాది రూపాయల రెవెన్యూ వచ్చే విధంగా ప్లాన్ చేయడం కోసం మొబిలిటీ వ్యాలీ అనే కార్యక్రమాన్ని సంకల్పించిందని తెలిపారు. అందుకు ఫార్ములా ఈ కార్ రేస్ కూడా నిర్వహించిందన్నారు. 

అదే రేస్ ఇంకా నాలుగు సార్లు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా జరగాల్సి ఉండేదని, కానీ రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల మొబిలిటీ వ్యాలీ రాష్ట్రానికి రాకుండా పోయిందన్నారు. దీని వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం కలిగిందన్నారు.