calender_icon.png 2 February, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ మొక్కజొన్న విత్తనాలు అమ్మరన్న ఆరోపణపై కేసు నమోదు

01-02-2025 10:28:49 PM

మొలకెత్తని పొలాలను పరిశీలించిన పోలీసులు, వ్యవసాయ శాఖాధికారులు..

ఇల్లెందు (విజయక్రాంతి): నకిలీ మొక్కజొన్న విత్తనాలను అమ్మి రైతులను మోసం చేశారన్న ఆరోపణపై టేకులపల్లి మండలం బేతంపూడి ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు లక్కినేని సురేందర్ రావుతో పాటు మరొకరిపై టేకులపల్లి పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. పోలీసులు, వ్యవసాయ శాఖాధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని చంద్రుతండాకు చెందిన 50 మంది రైతులకు పైగా ఎలాంటి లేబుల్ లేని, ఏ కంపెనీ అనేది మొక్కజొన్న విత్తనాల సంచులపై లేదని, అవి నాటిన రైతులు మొలకెత్తలేదని తెలిపితే మళ్ళీ ఇచ్చిన విత్తనాలు కూడా మొలకెత్త లేదని రైతులు ఫిర్యాదుతో మొదట టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్, వ్యవసాయాధికారి అన్నపూర్ణలు పొలాలను సందర్శించారు. రైతులు ఎలాంటి ఆమోదం లేని కంపెనీల విత్తనాలను కొనొగోలు చేయొద్దని అక్కడే ఏఓ రైతులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించి వివరించారు. నకిలీ విత్తనాలు ఆమ్మారన్న లక్కినేని సురేందర్ రావు, భూక్యా రాజేష్ (రాజా)లపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సిఐ తెలిపారు. కార్యక్రమంలో బోడు ఎస్సై శ్రీకాంత్  తదితరులు పాల్గొన్నారు.