calender_icon.png 11 January, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నీరి’ మాజీ డెరెక్టర్‌పై కేసు నమోదు

12-07-2024 12:47:23 AM

ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రాజెక్టులో ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు

సహకరించిన నలుగురు శాస్త్రవేత్తలపైనా సీబీఐ కేసులు

న్యూ ఢిల్లీ, జూలై 11 (విజయక్రాంతి): ప్రైవేట్ సంస్థలకు అడ్డగోలుగా ప్రభుత్వ ప్రాజె క్టులను కట్టబెట్టడంతో పాటు, ఎయిర్ ప్యూరి ఫైయర్ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనే ఆ రోపణల నేపథ్యంలో సీబీఐ పోలీసులు బుధ వారం నీరి (నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇం జినీరింగ్ ఇనిస్టిట్యూట్) మాజీ డైరెక్టర్ సహా నలుగురు శాత్రవేత్తలపై కేసులు నమోదు చే శారు. ఈ కేసులకు సంబంధించి బుధ వారం మహారాష్ట్ర, హర్యానా, బీహార్, ఢిల్లీలోని దా దాపు 17 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో కేసులకు సంబంధించి పలు కీలక దస్తావేజు లతో పాటు నిందితుల పేరు మీద ఉన్న ఆస్తు ల వివరాలు, ఆభరణాలను  సీజ్ చేశారు.

నేరపూరిత కుట్ర, అవినీతికి పాల్పడ్డారంటూ..

సీబీఐ అధికారులు మీడియాతో మాట్లా డుతూ.. సీఎస్‌ఐఆర్ చీఫ్ విజిలెన్స్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ డైరెక్టర్ రాకేష్ కుమార్, సెంట్రల్ ఢిల్లీలో విధులు నిర్వ హిస్తున్న సీనియర్ శాస్త్రవేత్తలు.. అట్యా కాపలే, సంజీవ్ గోయల్, రితేష్ విజయ్, సునీల్ గులి పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామ న్నారు. ఓ ఎఫ్‌ఐఆర్‌లో.. గులియా, గోయల్ ఇద్దరూ కలిసి.. వాయు అనే గాలి కాలు ష్యాన్ని తగ్గించే ప్రభుత్వ ప్రాజెక్టుకు సంబం ధించి ఎస్‌ఎస్ ఎన్విరాన్‌మెంట్ అనే ప్రైవేట్ కన్సల్టెన్సీ, అఖండ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమి టెడ్ సంస్థలతో కలిసి అవినీతికి పాల్పడ్డారనే వివరాలను పొందుపరిచింది.

కాగా నీరి ద్వా రా రూపొందిచబడిని వాయు ప్యూరిఫైయ ర్లు అత్యంత రద్దీగా ఉండే రోడ్ల వద్ద ఏర్పాటు చేయబడి.. గాలిలో వాయు కాలుష్యం స్థాయి ని తగ్గిస్తాయి. శాస్త్రవేత్తలు ప్రైవేట్ కంపెనీలతో కుమ్మకై అవినీతికి పాల్పడ్డారని ఆధారా లున్నట్లు సీబీఐ తెలిపింది.  మరో ఎఫ్‌ఐఆర్‌లో నీరి మాజీ డైరెక్టర్ కుమార్, శాస్త్రవేత్త కాప్లే మరో మూడు ప్రైవేట్ సంస్థల పేర్లను చేర్చింది.