calender_icon.png 17 January, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్‌తరుణ్‌పై కేసు నమోదు

11-07-2024 01:25:36 AM

  1. నార్సింగి పోలీసులకు ఆధారాలు అందజేసిన లావణ్య 
  2. తనకు అబార్షన్ చేయించాడని సంచలన ఆరోపణ

రాజేందనగర్, జూలై 10: సినీనటుడు రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తనతో 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్ సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని వదిలేశాడని లావణ్య అనే యువతి ఇటీవల నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో అతడు రిలేషన్‌లో ఉన్నాడని ఆమె ఆరోపించింది. లావ ణ్య ఫిర్యాదు నేపథ్యంలో తగిన ఆధారాలు అందజేయాలని గతంలో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

మంగళవారం సా యంత్రం ఆమె నార్సింగి పోలీసులకు కొన్ని ఆధారాలు అందజేయడంతో 420, 506, 493 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. తిరగబడరా సామీ సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి రాజ్‌తరుణ్ మాల్వీతో రిలేషన్‌లో ఉన్నాడని ఆరోపించింది. ఆమె సోదరుడు తనను బెదిరించాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది. రాజ్‌తరుణ్ తనను బెదిరించి దూరం పెట్టాడని చెప్పింది. తనకు సంబంధం లేని డ్రగ్స్ కేసులో ఇరికించడంతో 43 రోజులు జైలులో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజ్‌తరుణ్ తాను ఓ ఆలయంలో వివాహం చేసుకున్నామని లావణ్య తెలిపింది. తను కొన్ని రోజుల క్రితం తనకు అబార్షన్ చేయించాడని సంచలన ఆరోపణలు చేసింది. తాము ఇద్దరం కలిసి సంసారం కూడా చేశామని, విదేశాలకు సైతం కలిసి వెళ్లామని చెప్పింది. ఆ ఆధారాలను లావణ్య నార్సింగి పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

రోజుకో మలుపు

లావణ్య ఫిర్యాదు నేపథ్యంలో హీరోయిన్ మాల్వీ సైతం స్పందించింది. తనను లావణ్య అనవసరంగా కేసులోకి లాగిందని ఆరోపించింది. రాజ్‌తరుణ్, లావణ్య కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందని తెలిపింది. తనతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంటున్న తన సోదరుడి పేరునూ లావణ్య నిరాధారంగా ఇరికించిందని ఆరోపిస్తూ మాల్వీ సైతం ఉమెన్ సేఫ్టీ అధికారులకు లావణ్యపై ఫిర్యా దు చేసింది. లావణ్య రాజ్‌తరుణ్‌పై సినీ ఇండస్ట్రీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపింది. రాజ్‌తరుణ్‌కు అమ్మాయిల పిచ్చి అని కూడా ఆమె గతంలో సంచలన ఆరోపణలు చేసింది. తనను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి కొన్ని ఆడియోలు రికార్డు చేశాడని ఆరోపించింది.