calender_icon.png 21 January, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీపై కేసు నమోదు

20-01-2025 12:00:00 AM

దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందంటూ చేసిన వ్యాఖ్యలపై ఓ వ్యక్తి ఫిర్యాదు

గౌహతి, జనవరి 19: లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై అసోంలోని గౌహతి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల న్యూఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధా న కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై అసోంలో మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రాహుల్ వ్యాఖ్యలు వాక్ స్వాతంత్య్ర పరిమితి దాటాయని, జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా ఉన్నాయని ర్యాదులో పేర్కొన్నారు.

ప్రతిపక్ష నాకు డిగా.. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత  రాహుల్‌పై ఉందన్నారు. కాగా, ప్రా రంభోత్సవ కార్యక్రమంలో రా హుల్  ఏం మాట్లాడారంటే..“ఆర్‌ఎస్‌ఎస్ వంటి భావజాలం వేల సంవ త్సరాల నాటిది.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ దేశంలోని ప్రతీ సంస్థను తమ గుప్పి ట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు భారత దేశంపై కూడా పోరాడుతున్నాం..” అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు ఖండించారు.