calender_icon.png 30 October, 2024 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు

13-09-2024 01:02:36 AM

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): కొండాపూర్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు దాడి చేసిన ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాడిని అడ్డు కోవడంలో పోలీసులు విఫలమైన విషయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవడంతో పాటు బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే గాంధీతో పాటు ఆయన అనుచరులు 40 మందిపై కేసులు నమోదు చేశారు. అలాగే కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు ఎవరెవరు వచ్చారన్న దానిపై సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.