calender_icon.png 16 January, 2025 | 11:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిత్తిరి సత్తిపై కేసు నమోదు

08-08-2024 03:11:27 AM

భగవద్గీతను కించపరిచారని ఫిర్యాదు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): టీవీ పేరడీ షోలతో పాపులారిటీ సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడంటూ ఆయనపై రాష్ట్రీయ వానరసేన జాతీయ అధ్యక్షు డు నామ్ రామ్‌రెడ్డి మంగళవారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, బిల్లుగీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా ఒక షార్ట్ వీడియో చేశాడు. ఆ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యం గా మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఆ వీడియోను తొలగించి క్షమాపణలు  చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.