11-02-2025 08:53:22 PM
మంథని ఎస్ఐ డేగ రమేష్...
మంథని (విజయక్రాంతి): మంథని నుండి అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన మంథని ఎస్ఐ డేగ రమేష్ తెలిపారు. మంగళవారం అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు, మంథని పోలీసులు, సివిల్ సప్లయర్ ఇన్స్పెక్టర్ లు మండలంలోని నాగారం గ్రామ శివారు వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో ప్రజా పంపిణీ బియ్యం 10 ప్లాస్టిక్ సంచులలో ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారని, ఈ బియ్యం గురించి డ్రైవర్ తూర్పాటి రవిని విచారించిగా, మహారాష్ట్రలోని సిరివంచకు తరలిస్తున్నట్లు తెలిపారని ఎస్ఐ తెలిపారు. ఈ రేషన్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేశామని, అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.