calender_icon.png 24 November, 2024 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ అల్లం వెల్లుల్లి పెస్ట్ విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

23-11-2024 10:39:36 PM

కూకట్ పల్లి (విజయక్రాంతి):  నకిలీ అల్లం వెల్లుల్లి పెస్ట్ ను విక్రయిస్తున్నారనే ఫిర్యాదును స్వీకరించిన kphb పోలీసులు శనివారం ఉదయం సిద్ధివినాయక జనరల్ స్టోర్ పై ఆకస్మిక దాడి నిర్వహించి 35 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పెస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... kphb కాలని మార్కెట్ రోడ్డులోని సిద్ధివినాయక జనరల్ స్టోర్ లో గడువు ముగిసిన, నకిలీ అల్లం వెల్లుల్లి పెస్ట్ ను విక్రయిస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని అదే ప్రాంతానికి చెందిన ఎం.సురేంద్ర పోలీసులకు పిర్యాదు చేశాడు.

దీంతో ఎస్ఐ సుమన్ ఆద్వర్యంలో పోలీసు సిబ్బంది సిద్ధివినాయక జనరల్ స్టోరుపై అకస్మికదాడీ నిర్వహించగా నకిలీ వెల్లుల్లి డబ్బాలు, గడువు ముగిసిన వెల్లుల్లి డబ్బాలు దర్శనమిచ్చాయి. దీంతో షాపు యజమాని ఓం ప్రకాష్ ను పోలీసులు ప్రశ్నించగా గడిచిన ఆరు సంవత్సరాల కిందట దీపక్ అనే వ్యక్తి పరిచయం చేసుకొని తక్కువ ధరలకు  అల్లం వెల్లుల్లి పెస్ట్ తయారు చేసి సప్లై చేస్తున్నాడని వాటిని కొని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు. దీంతో అతని వద్ద నుంచి వివిధ పేర్లతో ఉన్న ఐదు కేజీల డబ్బాల నుంచి రెండువందల గ్రాముల డబ్బాల వరకు ఉన్న 35 కిలోల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్న పోలీసులు మూసాపేట సర్కిల్ ఫుడ్ సెఫ్టీ అధికారులకు అప్పగించారు