బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్న సుబ్బారావు పల్లి గ్రామానికి చెందిన రాస వెంకటేష్ అనే యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి టూ టౌన్ ఎస్సై కె. మహేందర్ తెలిపారు. మైనర్ బాలికను బలవంతం చేసే ప్రయత్నం చేయడంతో ఆమె తిరస్కరించిందని ఎస్సై చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు.