calender_icon.png 15 November, 2024 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పగ్గాలు చేపట్టిన తాత్కాలిక ప్రభుత్వం

09-08-2024 01:03:43 AM

హింసను ఆపండి

అల్లరిమూకలకు యూనస్ వినతి బంగ్లాదేశ్

రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ

ఢాకా, ఆగస్టు 8: బంగ్లాదేశ్‌లో పరిస్థితులను చక్కదిద్దేందుకు తాత్కాలిక ప్రభుత్వం గురువారం అధికారం చేపట్టింది. నోబెల్ పురస్కార గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలోని 16 మంది సభ్యుల సలహా మండలి ప్రమాణం చేసింది. యూనస్ చేత ఆపద్ధర్మ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆ దేశాధ్యక్షుడు మహ్మద్ షాహబుద్దీన్ బంగభబన్‌లో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏ లక్ష్యం కోసమైతే విద్యార్థులు ఉద్యమం చేశారో దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. దేశంలో హింసకు ముగింపు పలకాలని ఆందోళనకారులను కోరారు. బంగ్లాదేశ్ రాజ్యాంగం ఔన్యత్యాన్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. శాంతియుత బంగ్లాదేశ్ నిర్మాణమే అందరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు. తాత్కాలిక ప్రభుత్వ అధిపతిగా నియమితులైన యూనస్‌కు భారత ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.