calender_icon.png 26 December, 2024 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి డీసీఎం ను ఢీకొన్న కారు

26-10-2024 06:28:58 PM

రాజాపూర్: కారు అదుపుతప్పి డీసీఎం ను ఢీ కొట్టిన సంఘటన మండల కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఎస్సై రవి నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల వైపు నుండి హైదరాబాద్ వెళుతున్న కారు రాజాపూర్ శివారులో అదుపుతప్పి డివైడర్ను ఢీకొని రోడ్డు ఆవతల వైపు పడింది. అటు హైదరాబాదు నుండి జడ్చర్ల వైపు వస్తున్న డీసీఎం కారును ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వ్యక్తులను 108 అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వ దావకానకు తరలించారు .ఈ ప్రమాద ఘటనలతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరాలు వెల్లడించారు.