calender_icon.png 24 February, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఢీకొన్న కారు తృటిలో తప్పిన ప్రమాదం..

24-02-2025 12:10:06 AM

రాజాపూర్, ఫిబ్రవరి 23 : రాజాపూర్ మండల కేంద్రం శివారులోని బంగారు మైసమ్మ ముందు గల జాతీయ రహదారిపై ఆదివారం; రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం; హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి ముందుగా వెళుతున్న లారీని ఢీకొంది.

ఈ ప్రమాదం దుదుంది వాగుపై ఉన్న; బ్రిడ్జిపై లారీని ఢీ కొట్టడం జరిగింది. బ్రిడ్జిపై ఉన్న రేలింగ్ కారణంగా ఢీకొట్టిన కారు బ్రిడ్జి పైనే ఉండిపోయింది. దీంతో బ్రిడ్జిపై నుంచి కిందికి కారు పడకపోవడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులకు ఇలాంటి ప్రమాదం జరగలేదు.ఈ ప్రమాదం లో ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.