వివాహిత దుర్మరణం...
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని గంగారాంనగర్ వద్ద గల నేషనల్ హైవే 363 రహదారిపై గల నక్షత్ర హోటల్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఎలాంటి పార్కింగ్ సూచనలు లేకుండా నిర్లక్ష్యంగా నిలిపి ఉంచిన ఆర్‌జె 14 జిపి 4866 నెంబర్ గల లారీని హైదరాబాద్ నుండి కాగజ్‌నగర్‌కు వెళ్తున్న ఏపీ 09 ఏవీ 0924 నెంబరు గల కారు వెనుకవైపు నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా లారీ కింది భాగంలోకి దూసుకుపోయి నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న అక్క రాజేష్ (36) తీవ్రంగా గాయపడగా, కారులో ఉన్న అతని భార్య అక్క రేణుక (30) అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. కుమారుడు వేధిక్ (06) స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ముఖం, కుడి భుజంపై తీవ్ర గాయాలైన క్షతగాత్రుడు రాజేష్‌ను పోలీసులు హుటాహుటిన బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మృతి చెందిన రేణుకకు బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. గాయాలపాలై చికిత్స పొందుతున్న అక్క రాజేష్ తల్లి అక్క పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు బెల్లంపల్లి టూ టౌన్ ఎస్‌ఐ కె.మహేందర్ తెలిపారు.