కామారెడ్డి జిల్లా 161 రహదారిపై మేనూరు వద్ద ఘటన
త్రుటిలో ఐదుగురికి తప్పిన ప్రాణాపాయం
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ కారు సోమవారం ఉదయం 161వ జాతీయ రహదారిపై వెల్లుచుండగా కారు నుంచి మంటలు లేవడంతో కారులో ఉన్న ఐదుగురు త్రుటీలో తప్పించుకున్న ఘటన వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూరూ వద్ద 161వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై ఓ కారు దగ్ధమైంది. కారులో ఐదుగురు కలిసి మారేపల్లి నుంచి సిర్పూర్ కు వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా కారులో నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే వారు కారు నుంచి దిగిపోగా క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. త్రుటిలో ఐదుగురి ప్రాణాలు తప్పిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. మదునూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కారులో పెట్రోల్ లీకేజీ కావడం వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.