కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): విద్యార్థిని శైలజ మృతికి కారకులైన వారిని పూర్తిగా ఉద్యోగం నుండి తొలగించడంతో పాటు స్పష్టమైన హామీ ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం విద్యాసంస్థల బందుకు పిలుపునిచ్చారు. వాంకిడి మండలంలోని సవాతి ధాబాలో శైలజ మృతదేహానికి నివాళులర్పించిన నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. శైలజ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేసియా ఇవ్వడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వ్యవసాయ భూమి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అధికారులు ఇచ్చిన హామీ సంతృప్తికరంగా లేదని తెలిపారు. పోలీసు బలంతో అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి విద్యార్థిని అంతక్రియలు చేశారని ఆరోపించారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బందులో పాల్గొనాలని కోరారు.