calender_icon.png 25 November, 2024 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ బ్యాంకు అధికారుల గుట్టురట్టు

08-10-2024 12:00:00 AM

రుణాలు ఇప్పిస్తామని మోసం

రైతుల నుంచి రూ.26 లక్షలు వసూలు 

నల్లగొండలో ఏడుగురి ఆరెస్ట్ 

నల్లగొండ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నకిలీ బ్యాంకు అధికారులుగా చెలామణి అవుతూ బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సోమవారం వివరాలు వెల్లడించారు.

పెద్దవూర మండలం వెల్మగూడేనికి చెందిన కట్టెబోయిన పరమేష్, తెప్పలమడుగు గ్రామానికి చెందిన పల్లెబోయిన నాగరాజు, మిర్యాలగూడ మండలం జంకుతండాకు చెందిన మమ్ముల జ్యోతి స్వరూప్, జిప్త్తీ వీరప్పగూడేనికి చెందిన చిలుముల సైదులు, నార్కెట్‌పల్లి మండలం ఏపీలింగోటం గ్రామానికి చెందిన షేక్ వజీర్, నార్కెట్‌పల్లికి చెం దిన ముప్పిడి సైదులు, మాడుగులపల్లి మండలం చిరుమర్తికి చెం దిన కొండా శ్రీను, మిర్యాలగూడ బాపూజీ నగర్‌కు చెందిన గోగు ల సురేశ్ ముఠాగా ఏర్పడ్డారు.

కొంతకాలంగా బ్యాంకు అధికారులుగా చెలామణి అవుతూ పెద్దవూర, తిరుమలగిరి(సాగర్),  నిడమనూరు, నేరేడుగొమ్ము, దేవరకొండ, పీఏపల్లి మండలాల్లోని రైతులకు తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తం రుణం ఇప్పిస్తామని రూ.లక్షల్లో వసూలు చేశారు. హాలియాలోని ఓ వ్యాపారికి సాం ఘిక సంక్షేమశాఖ నుంచి భారీగా రుణం ఇప్పిస్తామని మోసగించారు.

రైతుల నుంచి ఫిర్యాదులు అందడంతో పెద్దవూర పోలీసు లు నిఘా పెట్టి వీరిని అదుపులోకి తీసుకున్నారు. 28 మంది రైతు ల నుంచి నిందితులు రూ.26 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. కోర్టు అనుమతితో ఈ మొత్తాన్ని రికవరీ చేయనున్నట్లు పేర్కొన్నారు. వీరి నుంచి రూ. లక్షా 60 వేల నగదు, పట్టాదారు పాస్ పుస్తకాలు, పలు భూ దస్త్రాలు స్వాధీ నం చేసుకున్నారు.