calender_icon.png 11 January, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలిక మెడలోకి బుల్లెట్

20-12-2024 12:27:59 AM

* మావోయిస్టులపై ఎదురుకాల్పుల్లో మిస్‌ఫైర్

రాయ్‌పుర్, డిసెంబర్ 19: ఈ నెల 12న ఛత్తీస్‌గఢ్ అంబుజ్ మార్గ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృ తిచెందిన విషయం తెలిసిందే. కాగా ఎదురుకాల్పుల సమయంలో భద్రతా బలగాల తుపాకీ నుంచి బుల్లెట్ గురితప్పడంతో నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. వీరిని ఆసు పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఇందులో ఓ 16 ఏండ్ల మైనర్ బా లిక మెడలో బుల్లెట్ ఉన్నట్లు పరీక్షల్లో తే లింది.

ప్రస్తుతం ఆ బాలిక రాయ్‌పుర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఓ నాలుగేండ్ల బాలుడు కూడా బుల్లెట్ గా యం నుంచి  తృటిలో తప్పించుకున్నా డు. బలగాల కాల్పుల్లో తన కండ్ల ముందే తన తండ్రిని కాల్చిచంపారని గాయపడిన మరో బాలుడు తెలిపాడు. తాము వ్యవసాయ క్షేత్రాల్లో పనులు చేస్తుండగా కా ల్పులు చోటుచేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అమా యకులైన గ్రామస్తులపై పోలీసులు కా ల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో మృ తిచెందిన వారిలో ఆరుగురు గ్రామస్తులేనని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. సీనియర్ నక్సల్ కమాండర్ కార్తీక్‌ను కాపాడేందుకే మావో యిస్టులు గ్రామస్తులను మానవ కవచాలుగా ఉపయోగి ంచుకున్నారని పోలీ సులు ఆరోపించారు. ఈ ఘటన స్థాని కంగా తీవ్ర కలకలం రేపుతోంది.