calender_icon.png 14 November, 2024 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్ద పులి దాడిలో ఎద్దు మృతి

13-11-2024 01:13:54 AM

బుర్కగూడలో ఘటన

నిర్మల్, నవంబర్ 12 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సంచ రిస్తున్న పెద్దపులి రోజకో ప్రాం తంలో అలజడి సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మంగళవారం పెంబి మండలం బుర్కగూడ గ్రామం అటవీ సమీపంలో ఓ ఎద్దుపై దాడి చేసి చంపే సింది. సోమావారం మామడ మం డలంలో కనిపించిన పెద్దపులి అక్కడే ఉంటుందని అంచనా వేసిన అటవీ అధికారులు ఆ ప్రాతంలో పులి జాడ కోసం అన్వేషణ ప్రారంభించారు.

కానీ మంగళవారం పెంబి సరిహద్దులో పులి కనిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మామడ సరిహద్దు ప్రాంతంలో మామడ రేంజ్ పరిధిలో పెంబి మండలం బుర్కగూడ గ్రామం వద్ద పశువుల కాపరికి కనిపించినట్టు తెలిపారు. అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించగా పులి అడుగులు కనిపించడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. పులి తిరుగు ప్రయాణంలో ఉన్నదని, ఎవరూ హాని తలపెట్టవద్దని గిరిజనులకు అధికారులు సూచించారు.