calender_icon.png 18 October, 2024 | 4:58 PM

రియల్‌రంగానికి ఊతమిచ్చిన బడ్జెట్

25-07-2024 01:39:14 AM

రాంకీ ఎస్టేట్స్ ఎండీ నందకిశోర్

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ రియల్ ఎస్టేట్ రంగానికి అనేక ఆశాజనకమైన అంశాలు ఉన్నాయని రాంకీ ఎస్టేట్స్ ఎండీ నందకిశోర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భూ రికార్డుల డిజిటలై జేషన్‌తోపాటు పారదర్శకమైన ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ లావాదేవీల సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీలతో సహా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పెట్టుబడులను పెంచడం వల్ల మెట్రో నగరాలు మరింత వృద్ధి చెందుతాయని వెల్లడించారు.

ఆస్తి విక్రయాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను 20 శాతం నుం చి 12.5 శాతానికి తగ్గించడం స్వాగతించాల్సిన అంశమని చెప్పారు. కాకపోతే, 2001 తర్వాత కొనుగోలు చేసిన ఆస్తులకు సంబంధించి ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని తొల గించడం వల్ల కొంతమేరకు ప్రతికూల ప్రభా వం పడుతుందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మూడు నుంచి ఐదేళ్లలోపు గల ఆస్తుల విక్రయాల్లో ఇది కనిపిస్తుందని అన్నారు.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద పెరిగిన నిధులు, వడ్డీ రాయితీల ద్వారా అందుబాటు గృహాలకు ప్రభుత్వం నిరంతరం మద్దతు తెలుపుతోందని చెప్పారు. దీని వల్ల బలహీనవర్గాల సొంతింటి కల సాకారం అవుతుందని తెలిపారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం ద్వారా అల్పాదాయవర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.