calender_icon.png 5 February, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలను ముంచి కార్పొరేట్లకు మేలు చేసే బడ్జెట్

05-02-2025 01:10:15 AM

* తెలంగాణ వ్యవసాయ కార్మిక  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి) : పేదలను నిండా ముంచి కార్పొరే ట్లకు పట్టం కట్టేలా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిఆర్ వెం కట్రాములు అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం అ సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొని  ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదల వలస నివారణ కొరకు వచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కేటాయించిన రూ 86 వేల కోట్లు మాత్రమే ఉన్నదన్నారు. 

అదనంగా పెంచలేదు.  వ్యవసాయ కార్మిక సంఘం (AIAWU) తరఫున సంవత్సరానికి 200 పని దినాలు పెంచుతూ రోజుకు కూలిరూ 800 లు ఇవ్వాలని దేశవ్యాప్త పోరాటాలు చేస్తున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలే దని విమర్శించారు. పట్టణ ప్రాంతాలలో కూడా పేదలు పెరుగుతున్నారు అందుకని పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభిం చాలి పలుమార్లు చెప్పడం జరిగిందని, కాగా ఆ ప్రస్తావనే తేలేదన్నారు.

ఈ బడ్జెట్ ద్వారా ఉపాధి హామీ రంగాన్ని ఎంత చిన్నచూపు చూస్తుందో అర్థమైతుందని, భవిష్యత్తులో రద్దు చేయబోయే ప్రమాదం కూడా ఉందని అర్థం అవుతున్నదన్నారు. రైతుల సమస్యల పైన, కనీస మద్దతు ధర పైన ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తున్నా,  రైతులకు కనీస మద్దతు ధర మర్చిపోయా రని విమర్శించారు. ఈ బడ్జెట్ బిజెపి రాజకీ య ప్రయోజన బడ్జెట్ అని విమర్శించారు. ఈ సమావేశం లో జిల్లా అధ్యక్ష కార్యదర్శు లు   కడియాల మెహన్, పి జగన్, నాయకు లు హన్మంతు, భగవంతు, యాదయ్య, శివ లిలా దున్న ఖాదర్ పాల్గొన్నారు.