calender_icon.png 25 October, 2024 | 8:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి దారుణ హత్య

23-06-2024 12:05:00 AM

  1. వివాహితతో అక్రమ సంబంధం
  2. ఇనుపరాడ్డుతో ఆమె సోదరుడి దాడి

చార్మినార్, జూన్ 22 : ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకొని వేధిస్తున్న యువకుడిని ఆమె సోదరుడు ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేసిన సంఘటన ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శనివారం ఇన్‌స్పెక్టర్ ఆదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌నగర్ బాబాకాంటకు చెందిన జాకీర్ అలీ (29) వృత్తిరీత్యా డ్రైవర్. ఐదేళ్ల క్రితం అచ్చిరెడ్డినగర్‌కు చెందిన ఓ వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. శనివారం రాత్రి ఎవరూ లేని సమయంలో ఆమె ఇంటికి వచ్చి లైంగికంగా లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అతడి వేధింపులు భరించలేక తన సోదరుడు షఫీకి చెప్పింది. ఈ క్రమంలో షఫీ జాకీర్‌కి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన షఫీ ఇనుపరాడ్‌తో జాకీర్ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన జాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫలక్‌నుమా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.