మణికొండ, జూన్ 29: ఓ యువ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండ గులు అతడిని కత్తులతో పొడిచి చంపేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్‌లో వెంచర్లో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి కథనం ప్రకారం.. గోల్కొండ చోటా బజార్‌కు చెందిన ఇదాయత్ అలీ (31) సౌదీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. 15 రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఇదిలా ఉండగా అతడు శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తన తండ్రికి చెందిన క్వాలీస్ వాహనం తీసుకొని బయటకు వెళ్లాడు.
సుమారు 12.30 గంటల సమయంలో మంచిరేవుల గ్రీన్‌ల్యాండ్స్ వెంచర్‌లోని ఓపెన్ ప్లాట్‌లో ఓ యువకుడు హత్యకు గురయ్యాడనే సమాచారంతో నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దుండగులు ఇదాయత్ అలీని కత్తులతో పొడవడంతో కేకలు వినిపించాయని స్థానికంగా పనిచేస్తున్న కూలీలు పోలీసులకు తెలిపారు. ఇద్దరు దుండగు లు చంపేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యకు ముందు గొడవ జరిగినట్లు తెలిపారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే, ఇద్దరు నిం దితులతో పాటు ఓ యువతి కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలను పరిశీలి స్తున్నట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.