కామారెడ్డి జిల్లా చిన్న కొడపుగల్ లో ఘటన...
కుటుంబ కలహాలతోని హత్య అని భావిస్తున్న పోలీసులు
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా చిన్న కోడపుగల్ గ్రామానికి చెందిన గురిగి సత్యవ్వ (56) సంవత్సరాలు గల మహిళను హత్య చేశారని పిట్లం ఎస్ఐ రాజు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ కలహాల వల్లే ఆమెను కుటుంబ సభ్యుల హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పిట్లం మండల కేంద్రంలో మహిళ హత్య కలకలం రేపుతుంది. హత్య చేయడానికి గల కారణాలు తెలియలేదు. పిట్లం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.