calender_icon.png 7 April, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్దీపకంతో ఉజ్వల భవిష్యత్తు

29-03-2025 12:00:00 AM

  • ఆశ్రమాల్లో’సత్ఫలితాలనిస్తున్న పుస్తకాలు          

ఇంగ్లిష్, గణితంపై పట్టు సాధిస్తున్న గిరిబిడ్డలు       

ప్రాథమిక విద్యపై ఐటీడీఏ పీవో రాహుల్ మార్క్  

భద్రాచలం మార్చి 28 (విజయక్రాంతి ) భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ముందు చూపుతో ప్రవేశపెట్టిన ఉద్దీపకం వర్క్ బుక్ లు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన నేపథ్యంలో గిరి బిడ్డలు ఎక్కడ కూడా విద్యాపరంగా ఇబ్బంది పడకుండా పునాది స్థాయిలో బలమైన స్టాండర్డ్స ను ఇవ్వాలనే సంకల్పంతో భద్రాచలం ఐటిడిఏ ఈ ఉద్దీపన పుస్తకాలను రూపొందించింది.

3,4,5 తరగతుల వారికి గణితము, ఇంగ్లీష్ వర్క్ బుక్కులను నిష్ణాతులైన టీచర్ల చేత తయారు చేపించారు. బొమ్మలతో కూడిన ఈ పుస్తకాలకు గిరి బిడ్డలు సులభంగా నేర్చుకోవడానికి వీలుగా తయారు చేశారు. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగా హారాలు ఇలా అనేక కృత్యాలను పిల్లలు అవలీలగా నేర్చుకొని చక్కని అభ్యాసనాలను పొందుతున్నారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉద్దీపకం పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

తద్వారా ప్రాథమిక పాఠశాలలో కింది తరగతిలో అన్ని సబ్జెక్టులో పిల్లలు రాణించేలా గట్టి ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదివే పిల్లలకు రెండవ తరగతి పాఠ్యాంశాలు చదివే పరిస్థితి లేదని, 2018 నుంచి విద్యా ప్రమాణాలు కుంటుపడుతున్నాయని దీనిపై చక్కని ఆలోచన చేయాలని అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో...

భద్రాచలం ఐటిడిఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉద్దీపనం అనే నూతన పుస్తకాల ఆవిష్కరణ ద్వారా ప్రాథమిక విద్యలో పటిష్ట పునాది పడుతుండం పట్ల సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తం అవుతుంది. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్ తీసుకుంటున్న విద్యాపరమైన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తుండటం పట్ల పలువురు అభినందిస్తున్నారు