calender_icon.png 6 October, 2024 | 5:51 PM

మత్స్యకారులకు మంచి భవిష్యత్తు

06-10-2024 03:37:09 PM

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : మత్స్యకారులకు భవిష్యత్తులో మరింత మంచి భవిష్యత్తు ఉంటుందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఇబ్రహీంబాదుకు చెందిన మత్స్యకారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మత్సకారుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో ఉండడం జరుగుతుందని తెలియజేశారు. చెరువులను పూర్తిగా రక్షించేందుకు ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా చెరువులు కబ్జాలకు గురి అయితే ఎంతటి వారినైనా వదలకుండా వారి నుంచి చెరువులను కాపాడుతుందని పేర్కొన్నారు.

మత్స్యకారులకు మంచి భవిష్యత్తు ఇవ్వడంతో పాటు భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటే అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. గ్రామానికి చెరువు ఒక ప్రాణం లాంటిదని చెరువులో నిరంతరం నీరు ఉంటే ఆ గ్రామ అభివృద్ధి పూర్తి స్థాయిలో సమగ్రంగా జరుగుతుందని తెలియజేశారు. భవిష్యత్తులో మత్స్యకారులకు మరింత మేలు జరుగుతుందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మత్సకారులు చెరువులు నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని,  వారికి భవిష్యత్తు లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే చెరువులు కాపాడుకోవాలని ఆయన సూచించారు.  అనంతరం వారు ఎమ్మెల్యేను శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సన్మానించారు. హేమ సముద్రంలో  చేపలు విడిచే కార్యక్రమానికి రావాలని మత్స్యకారులు కోరారు. ఈ కార్యక్రమంలో  మత్సకారుల సంఘం అధ్యక్షులు కె.వెంకటయ్య, సభ్యులు ఎర్ర వెంకటయ్య, పి.వెంకటయ్య, ఒన్నాడ అంజిలయ్య తదితరులు పాల్గొన్నారు.