calender_icon.png 6 March, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డైరీ టెక్నాలజీకి ఉజ్వలమైన భవిష్యత్

06-03-2025 12:20:55 AM

కామారెడ్డి మార్చ్ 5 ( విజయక్రాంతి ); డైరీ టెక్నాలజీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డిడైరీ టెక్నాలజీ ఇన్చార్జి డిన్ కె ఎస్ ఉమాపతి తెలిపారు. బుధవారం డైరీ కళాశాలలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

60 ఎకరాల విస్తీర్ణంలో కామారెడ్డిలో డైరీ టెక్నాలజీ కోర్స్ ఉందని తెలంగాణలో మరెక్కడా  లేదని ఆయన అన్నారు. కంప్యూటర్ టెక్నాలజీ రంగం అంటూ యువత ఆవైపు మాత్రమే దృష్టి సారించారని పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్న డైరీ కోర్స్ పట్ల శ్రద్ధ చూపకపోవడంబాధాకరంగా ఉందన్నారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ చేసి ఎంసెట్లో ఉత్తీర్ణులైన  విద్యార్థులకు మాత్రమే డైరీ టెక్నాలజీ కోర్సులో తీసుకోవడం జరుగుతుందన్నారు.

డైరీ కోర్సు నాలుగు సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ఆరు నెలలు ఏదో ఒక సంస్థలో విద్యార్థులు పని నేర్చుకోవాల్సి ఉంటుందని ఆ పని నేర్చుకుంటున్న క్రమంలో ఆ సంస్థకు పని విధానం నచ్చినట్లైతే తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. బాలురకు మహిళలకు వసతి భోజన సౌకర్యంతో అన్ని అంగుళాలతో డైరీ టెక్నాలజీ కోర్సు నడుస్తుందన్నారు.

విద్యార్థులకు చదువు నేర్చుకోవడానికి కావలసిన సాంకేతిక నైపుణ్యతతో కూడిన టెక్నాలజీ అందుబాటులో ఉందని ఆ టెక్నాలజీతో వారికి శాస్త్రీయంగా పనిచేసే విధానాన్ని చూపించడం జరుగుతుందన్నారు. పాల ద్వారా ఏ పదార్థాలు ఎలాంటి స్వీట్లు తయారు చేయాలో వివరించడం జరుగుతుందని పూర్తి నైపుణ్యం సాధించిన తర్వాతనే వారికి ఇతర ప్రైవేటు డైరీలో ఆరు నెలలు శిక్షణ కోర్సులకు పంపించడం జరుగుతుందని ఆ సమయంలో 11 వేల రూపాయలు ప్రభుత్వం స్టైపైండు కూడా చెల్లిస్తుందన్నారు.

బీటెక్ కంప్యూటర్ రంగాల వైపు మొగ్గు చూపే యువత డైరీ టెక్నాలజీ వైపు ముగ్గు చూపుతే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో విజయ డైరీ సంస్థలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఎవరు ఉపాధి లేకుండా లేరన్నారు. కామారెడ్డి డైరీ టెక్నాలజీలో చదువుకున్న విద్యార్థులు చాలామంది సొంతగా డైరీ ఫారమ్స్ ఏర్పాటు చేసుకొని ఉన్నతమైన స్థాయిలో జీవిస్తున్నారని తెలిపారు. యువత డైరీ టెక్నాలజీ కోర్సులు నేర్చుకొని ఆర్థికంగా  ఎదగాలని ఆయన సూచించారు.