03-03-2025 12:36:03 AM
ఘట్‌కేసర్, మార్చి 2, (విజయక్రాంతి): క్రీడలలో రాణించిన ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు. పోచారం మున్సిపాలిటీ కాచవాని సింగారం లోని ఆల్ఫా క్రికెట్ గ్రౌండ్ లో పిర్జాదిగూడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత భద్ర నాయక్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ క్రీడలను ఆదివారం ఆయన ప్రారంభించారు.
క్రీడలతో దేహదారుద్యంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతాయని, ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించాలంటే క్రీడలలో రాణించాలని ఆయన తెలిపారు. క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను యిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పిర్జాదిగూడ కూడా మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కాంగ్రెస్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, నాయకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.