26-04-2025 11:00:58 PM
సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు...
మణుగూరు (విజయక్రాంతి): పోచంపల్లి చెరువు కాలువపై వంతెన నిర్మాణం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు. పగిడేరు గ్రామంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలో గల పగిడేరు నుండి విప్పల గుంపు వెళ్లే రహదారిలో పోచంపల్లి చెరువు కాలువకు గతంలో చెప్టా నిర్మాణం చేయడం జరిగినది. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు చెప్టా కొట్టుకుపోవడం జరిగిందన్నారు.
దీంతో రైతులు పంట పొలాలకు వెళ్లాలంటే అనేక అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ కాల్వపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వేసవికాలంలో పగిడేరు గ్రామంలో మంచినీరు లేక ప్రజలు అనేక ఇబ్బందులు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు ద్వారా త్రాగునీరు నామమాత్రంగానే వస్తున్నాయని, కొన్ని ప్రాంతాలకు పూర్తిగా త్రాగునీరు రాక ప్రజలు ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతర్గత రహదారులు హస్తావ్యస్తంగా ఉన్నాయని తక్షణమే రహదారులు నిర్మాణం చేయలాన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కుంజా రాజు, శాఖ కార్యదర్శి కుంజా నరసింహారావు, కుంజ రాజా, పర్షిక పాపారావు, కుంజా యుగంధర్, కుంజా ప్రసాద్ రావు, పూనెం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.