calender_icon.png 17 November, 2024 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజుల ర్యాలీకి బ్రేక్

31-10-2024 12:29:19 AM

  1. 427 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్
  2. బ్యాంకింగ్, ఐటీ షేర్లలో అమ్మకాలు

ముంబై, అక్టోబర్ 30: క్రితం రోజు నష్టాల మార్కెట్‌ను లాభాల్లోకి నడిపించిన బ్యాంకిం గ్ షేర్లే బుధవారం స్టాక్ సూచీలను పడగొట్టా యి. దీంతో వరుస రెండు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 427 పాయిం ట్ల నష్టంతో 80,000 స్థాయి దిగువన 79,942 పాయింట్ల వద్ద ముగిసింది.

ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 24,400 పాయింట్ల స్థాయిని కోల్పోయి, 126 పాయింట్ల నష్టంతో 24,340 పాయిం ట్ల  వద్ద నిలిచింది. మంగళవారం సెన్సెక్స్ 364 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్ల చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే.  గ్లోబల్ సెంటిమెంట్ బలహీనత, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లలోజరిగిన భారీ అమ్మకాలు తాజా క్షీణతకు కారణమని ట్రేడర్లు తెలిపారు. అదేపనిగా విదేశీ ఫంద్స్ జరుపుతున్న విక్రయాలు కూడా సెంటిమెంట్‌ను దెబ్బతీసిందన్నారు. 

ఇన్ఫోసిస్ టాప్ లూజర్

సెన్సెక్స్ ప్యాక్‌లో అన్నింటికంటే అధికంగా ఇన్ఫోసిస్ 2శాతంపైగా తగ్గింది. ఐసీఐ సీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు 1.7 శాతం వరకూ క్షీణించాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ,  బజాజ్ ఫైనాన్స్, టైటాన్‌లు 3 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు మారుతి సుజుకి, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్,  ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 2.5 శాతం వరకూ పెరిగాయి. 

విక్రయాల జోరు పెంచిన ఎఫ్‌పీఐలు

గత రెండు రోజులుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెసర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు బుధవారం గణనీయంగా పెరిగాయి. తాజా గా రూ.4,613 కోట్ల విలువైన పెట్టుబడుల్ని ఎఫ్‌పీఐలు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మంగళవారం విదేశీ ఫండ్స్ విక్ర యాలు రూ.548 కోట్లకే పరిమితమయ్యా యి. అక్టోబర్‌లో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు భారత్ నుంచి రూ.1 లక్ష కోట్ల మేర నిధుల్ని ఉపసంహరించుకున్నారు.