05-07-2024 01:35:14 AM
కోల్‌కతా, జూలై 4: కోల్‌కతాలో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. ప్రియురాలిని చంపాలని పక్కా ప్లాన్‌వేసిన ప్రియుడు చివరకు తానే మరణించాడు. దక్షిణ 24 పరగణాల జిల్లా బడ్జ్‌బడ్జ్ ప్రాంతానికి చెందిన రాకేశ్‌కుమార్ షా, అతడి ప్రియురాలు నిక్కుకుమారి దూబే కోల్‌కతా లోని లేక్ గార్డెన్ ప్రాంతంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బుధవారం దిగారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో వారున్న గదినుంచి తుపాకీ పేలుళ్ల చప్పుడు వినిపించింది. ఆ వెంటనే నిక్కు రక్తమోడుతూ రిసెప్షన్ వద్దకు పరుగెత్తుకొచ్చి రాకేశ్ తనను చంపాలని చూస్తున్నట్టు చెప్పింది. ఆ సమయంలో మరోసారి తుపాకీ పేలింది. సిబ్బంది పరుగు పరుగున వెళ్లి చూడగా రాకేశ్ రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించాడు.