calender_icon.png 13 January, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజతో బాలుడి మెడకు గాయం

13-01-2025 04:26:46 PM

నిజామాబాద్ (విజయక్రాంతి): చైనా మాంజా అమ్మకం, వాడకం ప్రాణాంతకం అని అధికారులు సూచిస్తూతున్నప్పటికిని చైనా మాంజా దొంగ చాటుగా ప్రజల చేతుల్లోకి చేరుతోంది. సోమవారం చైనా మంజాతో బాలుడు గొంతు తెగి గాయపడిన సంఘటన నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో జరిగింది. గాలిలో వచ్చి పడిన తెగిన గాలిపటానికి ఉన్న చైనా మాంజాతో ఆడుకుంటున్న బాలుడి  గొంతును చైనా మాంజ రాపిడితో కోసింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఇది ఇలా ఉండగా చైనా మాంజాలపై విక్రయాలపై టాక్స్ పోస్ పోలీసులు స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు చైనా మాంజా విక్రయ దుకాణాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటీవలే నిజాంబాద్ నగరంలోని పతంగుల దుకాణాలపై దాడులు జరిపిన పోలీసులు పెద్ద ఎత్తున చైనా మాంజా రిల్ ల ను స్వాధీనం చేసుకున్నారు.