calender_icon.png 26 December, 2024 | 5:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బావిలో పడి బాలుడి మృతి

03-11-2024 12:48:30 AM

ఆదిలాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు బావిలో పడి బాలుడు మృతిచెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంద్ర వెళ్లి మండలం  అనంతపూర్ గ్రామానికి చెందిన తుడసం లాల్‌శావ్(11) శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు గ్రామంలో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు.

శనివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావి లో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గమనించారు. బావిలోని నీటిని పరిశీలిస్తున్న క్రమంలో జారిపడి ఉండొచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా లాల్‌శావ్ 6వ తరగతి చదువుతున్నాడు.