calender_icon.png 16 January, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బూస్టర్ డోస్ తీసుకునేలా ప్రోత్సహించాలి

14-07-2024 01:13:09 AM

ఎన్‌ఐవీ మాజీ డైరెక్టర్ ప్రియా అబ్రహం

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): దేశంలో కరోనా బూస్టర్ డోస్ ను కేవలం 27 శాతం మంది మాత్రమే తీసుకున్నారని, వాటి ఉత్పత్తి పెంచాలని తాము ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్టు సీఎంసీ వెల్లూరు సీనియర్ ప్రొఫెసర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్‌ఐవీ) మాజీ డైరెక్టర్ డాక్టర్ ప్రియా అబ్రహం తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో కేవీ రావు సైంటిఫిక్ సొసైటీ వార్షికోత్సవ సైన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొవాక్సిన్ తయారీలో ప్రియా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బూస్టర్ డోస్ తీసుకునేలా ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహించాలని కోరారు.

ఏపీని గంజాయి రహితంగా మారుస్తాం: డీజీపీ  

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని, త్వరలో యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శనివారం ఏపీ శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని, దీంతో పాటు రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను కూడా అడ్డుకుంటామన్నారు. పోలీసుల కోసం కొత్త వాహనాలు కోనుగోలు  చేయనున్నట్లు చెప్పారు. అర్హులైన పోలీసులకు త్వరలో పదోన్నతలు కల్పిస్తామని, కానిస్టేబుళ్ళ నియమకాలు కూడా చేపడతామన్నారు. ఏ పార్టీకి కొమ్ముకాయకుండా పని చేస్తామని, పౌరులకు మెరుగైన సేవలు అందించి సమాజానికి జవాబుదారితనంగా ఉంటామన్నారు.