calender_icon.png 15 January, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర సర్వేతో బల్దియాకు బూస్ట్

07-12-2024 01:10:08 AM

  1. గ్రేటర్ వ్యాప్తంగా 23లక్షల నిర్మాణాలుగా తేల్చిన అధికారులు
  2. నూతనంగా 4లక్షల నిర్మాణాల గుర్తింపు
  3. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెరగనున్న బల్దియా ప్రాపర్టీ ట్యాక్స్!

  4. హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. సర్వే కారణంగా బల్దియా ఆదాయం మాత్రం పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ప్రస్తుతం 19లక్షల నిర్మాణదారులు ఉన్నట్టుగా అధికారిక లెక్కలున్నాయి. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా.. ఇటీవల గ్రేటర్‌లోని 6 జోన్లు, 30 సర్కిళ్లలో చేపట్టిన సర్వేలో జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 23లక్షల నిర్మా ణాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు.

  5. దీంతో ఇప్పటివరకూ బల్దియా సిబ్బంది ప్రాపర్టీ ట్యాక్స్ సేకరిస్తున్న 19 లక్షల నివాసాలు, వ్యాపార సముదాయాలకు బదులు గా రానున్న ఆర్థిక సంవత్సరం లో 23లక్షలు నిర్మాణాలనుంచి ట్యాక్స్ వసూలు చేసే అవకాశం ఉంది. అంటే మరో 4 లక్షల నిర్మాణాల నుంచి ఆస్తిపన్ను వసూలు చేసేందుకు బల్దియాకు అధికారం ఉన్నట్లు లెక్క. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా వచ్చే ఆస్తిపన్ను ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

చెల్లింపుదారులు 17 లక్షలు మాత్రమే

బల్దియాలో ప్రస్తుత లెక్కల ప్రకారం 19.25 లక్షల భవన నిర్మాణాలు ఉండగా..  వీటిలో 2.50 లక్షల భవనాలు వ్యాపార సముదాయాలు కాగా, మిగతా 16.75 లక్షల నివాసాలు.. గృహాలు. ఈ మొత్తం 19.25 లక్షల నిర్మాణాలలో క్రమం తప్పకుండా ఆస్తిపన్ను చెల్లింపుదారులు 17 లక్షలు మాత్రమే. మిగతా 2 లక్షల భవన నిర్మాణాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ బల్దియాకు రావడం లేదు. ట్యాక్స్ చెల్లించని భవనాలలో అత్యధికంగా క్లోజ్‌డ్ నివాసాలు, డూప్లికేటు ఎంట్రీలు, ల్యాండ్ అక్విజేషన్, డిస్‌ప్యూట్ ప్రాపర్టీస్, కోర్టు కేసులు తదితర నిర్మాణాలు ఉన్నట్లు సమాచారం. 

ఈ తరహా నిర్మాణాలు గ్రేటర్‌లో అసలు ఎన్ని ఉన్నాయి అనే విషయా న్ని అధికారులు తేల్చడంలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తున్నట్టుగా విమ ర్శలు ఉన్నాయి. దీంతో ప్రతి ఏడాది లెక్కకు మాత్రం 19 లక్షల నిర్మాణాలు ఉండగా, 17 లక్షల నిర్మాణాల నుంచే ఆస్తిపన్ను చెల్లింపులు జరుగుతున్నట్టుగా అధికారులు చెబుతున్నారు. అలాగే సర్వేకు సంబంధం లేకుండా కేవలం ప్రాపర్టీ ట్యాక్స్ పెంచుకోడానికి చేపడుతున్న జీఐఎస్ సర్వే ఫలితాలు వెలువడిన అనంతరం ఆదాయం ఏ మేరకు పెరుగుతుందో చెప్పగలమని అధికారులు అంటున్నారు. 

ఈ ఏడాది టార్గెట్ రూ.2,100 కోట్లు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 2023 ఏడాదిలో 1,800 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్‌గా ఉండగా.. ఇప్పటివరకు (డిసెంబర్) రూ. 1,917 కోట్ల ట్యాక్స్ వసూలయ్యింది. దీంతో ఈ 2024 ఏడాది టార్గెట్‌ను గతేడాది వసూలు చేసిన రూ.1,917 కోట్లు వసూలు లక్ష్యాన్ని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటివరకు రూ.1,349 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్‌ను జీహెచ్‌ఎంసీ వసూలు చేసింది. ఈ మొత్తం గతేడాది నవంబరులో వసూలైన దానికంటే రూ.100 కోట్లు అదనంగా వసూలైనట్టు అధికారులు చెబతు న్నారు.

గతేడాది వసూలైన రూ.1,917 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్‌ను  మించాలంటే మరో రూ.560 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. సాధారణంగా ప్రాపర్టీ ట్యాక్స్ అత్యధికంగా మార్చి నెలలోనే వసూలవుతుంది. 2024 మార్చి నెలలో ఏకంగా రూ.458 కోట్లు వసూలయ్యింది. ఈ ప్రకారంగా ఈ ఆర్థిక సంవత్స రం పూర్తవ్వడానికి ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉండటంతో గతేడాదికి మించి అనుకున్న లక్ష్యం మేరకు 2000 కోట్ల నుంచి రూ. 2100 కోట్లు దాకా ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అవుతుందని బల్దియా అంచనా వేస్తోంది.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలోనే 4 లక్షలు భవనాలు పెరగగా, జీఐ ఎస్ ద్వారా ఇంకా ఏమైనా భవన నిర్మాణాలు పెరుగుతాయా.. లేదో చూడాల్సి ఉంది. ఈ భవన నిర్మాణాల నుంచి అనుకున్నట్టుగా ట్యాక్స్ వసూలైతే వచ్చే ఆర్థిక ఏడాది నుంచి బల్దియా ఆదాయం మరింత పెరగనుంది.