calender_icon.png 15 April, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు ఒక వరం.. దేశంలోనే విప్లవాత్మకం

03-04-2025 12:00:00 AM

సన్న బియ్యం పంపిణీ.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

చొప్పదండి, ఏప్రిల్2(విజయక్రాంతి): దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. ఈ పథకం పేదలకు ఒక వరమని, ధనికులు తినే సన్నబియ్యాన్ని పేదలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  అందిస్తున్నారని తెలిపారు. ఇది ఒక గొప్ప అవకాశమని, ఈ పథకాన్ని పేదలందరూ సద్వినియోగం చేసుకో వాలని సూచించారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రామడుగు మండలం వేదిర గ్రామం లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సన్న బియ్యాన్ని లబ్దిదారులకు అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఇందుకు నిదర్శనమే సన్నబియ్యం పథకం ప్రారంభించడమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  దేశ చరిత్రలోనే ఈ పథకం విప్లవాత్మక మైనదని, పేదల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.

పేదలు దొడ్డు బియ్యం తినలేరనీ, పీడీఎస్ బియ్యాన్ని మిల్లర్లు, దళారులు సైక్లింగ్ చేస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ పేదలకు సమృద్దిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తామని తెలిపారు. జిల్లాలోని రేషన్ షాప్ ల ద్వారా తెల్ల కార్డుదారులకు ఇక నుంచి ప్రతి నెలా సన్న బియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.  జిల్లా కలెక్టర్ తెలిపారు.

వానాకాలం వరి పంట కొనుగోలు సమయంలో రైతులకు  క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లించి సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.జిల్లాలో ఉన్న చౌక ధరల దుకాణాల ద్వారా ఇక నుంచి సన్న రకం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగు తుందని, దీనికీ అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను 150 కి పైగా పెంచామని పేర్కొన్నారు. పేదలందరూ సన్న బియ్యం పథకాన్ని వినియోగించు కోవాలని సూచించారు.