* ఆకట్టుకున్న ఖవ్వాలీ ప్రదర్శన
* స్లాళ్లను సందర్శించిన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న 37వ బుక్ ఫెయిర్ మరో రెండు రోజులు మాత్రమే ఉండటం, రాష్ట్ర ప్రభు శుక్రవారం సెలవురోజు ప్రకటించడంతో జనాలతో కిటకిటలా డాక్టర్ బోయి విజయభారతి వేదికపై నిర్వహించిన బాలోత్సవ కార్యక్రమం ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ లేనట్టుగా బుక్‌ఫెయిర్‌లో ఖవ్వా సంగీత ప్రదర్శన నిర్వహించారు.
శాసనమండలి చైర్మన్ బండ ప్రకాశ్ బుక్‌ఫె పలు స్టాళ్లను సందర్శించారు. ప్రముఖ కవి సిద్ధార్థ రచించిన మల్లెల తీర్థం మహా ఖననం పుస్తకాన్ని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ సంధ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత చిత్రకారుడు ఏలె లక్ష్మణ్, ప్రముఖ కథా రచయిత బీఎస్ రాములు, పాశం యాదగిరి, అం సురేంద్ర రాజు, బుక్‌ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ పాల్గొన్నారు.
అలాగే డాక్టర్ సంధ్య విప్లవ్ రచిం అరుణిమ చారిత్రాత్మక నవల పుస్తకాన్ని బీఎస్ రాములు ఆవిష్కరించగా, ప్రొ.కాసీం, వీక్షణం వేణుగోపాల్, ప్రముఖ సాహిత్య విమర్శకులు కోయి కోటేశ్వరరావు, భంగ్యా నాయక్, బండారు విజయ పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ పీవీ రావు రచించిన వార్తలు సమాప్తం లోపలి కథ మొదలు పుస్తకాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు.
కోయి కోటేశ్వర రావు రచించిన నాగస్వరం కవితల పుస్తకావిష్కరణలో ప్రముఖ కవి శిఖామణి, కవి యాకూబ్, సంగిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. సంధ్య విప్లవ్ రాసిన త్రికాల పుస్తకాన్ని ప్రముఖ రచయిత సతీష్ చందర్ ఆవిష్కరించారు.
ఆకట్టుకున్న ప్రత్యేక అవసరాల పిల్లల ప్రదర్శన...
బుక్ ఫెయిర్‌లో నవభారత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బోయి విజయభారతి వేదికపై ప్రత్యేక అవసరాల పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి పాటలకు వారు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన చూసినవారంతా కరతాలధ్వనులతో వారిని అభినందించారు.
ఈ కార్య ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ లియో చైర్మన్ 320 లయన్ మోహన్‌దాస్, చొక్కాపు వెంకటరమణ, డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్ పాల్గొన్నారు. బుక్ ఫెయిర్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శనివారం హాజరవుతారని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ తెలిపారు.